
ఎరువులను అధిక ధరలకు విక్రయించొద్దు
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలఅగ్రికల్చర్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల ముందు ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. నకిలీ విత్తనాలు, పురుగులమందులు విక్రయించొద్దని సూచించారు. దుకాణానికి వచ్చిన రైతులతో ముచ్చటించారు. ఏ పంట వేశారు..? ఏ ఎరువు వేశారు..? ఏ మేరకు వేస్తున్నారు..? ఆ ఎరువు వల్ల పంటకు కలిగే ఉపయోగమేంటి..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. షాపులోని రికార్డులు పరిశీలించారు. వ్యవసాయాధికారి భాస్కర్, ఏఓ వినీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
7న ఓబీసీ జాతీయ మహాసభ
జగిత్యాలటౌన్: ఈనెల 7న గోవాలో ఓబీసీ జాతీ య మహాసభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండభేరి నరేశ్ తెలిపా రు. జిల్లాకేంద్రంలోని శనివారం చలో గోవా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన గోవాలోని శ్యాంప్రసాద్‌ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ప దో బీసీ మహాసభకు బీసీలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 42శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి తెలంగాణ బీసీలకు న్యాయం చే యాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి భూ మి రమణ, నాయకులు ముఖేష్ ఖన్నా, గంగ జల, పెండెం గంగాధర్, వేముల మనోజ్, మానాల కిష న్, గంగిపెల్లి శేఖర్, వేణుమాధవ్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల నేపథ్యంలో ఈనెల 31వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకో లు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.

ఎరువులను అధిక ధరలకు విక్రయించొద్దు