
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్‌మేట్స్‌ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం. చదువులు పూర్తయ్యాక చిన్ననాటి మిత్రులందరూ వివిధ దేశాలు, పట్టణాల్లో డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, వ్యాపారులుగా స్థిరపడ్డారు. ఎవరెక్కడ ఉన్నా మేమంతా ఒకరికొకరు తోడుగా ఉన్నామన్న భరోసా ఇస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. 30 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్ ద్వారా నిత్యం టచ్‌లో ఉంటాం. ఏడాదికోసారి ఒకచోట కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి