
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్‌లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు. నా కంటే సీనియర్ ఆఫీసర్ అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చాలా క్లోజ్‌గా ఉంటారు. నాకు మంచి ఫ్రెండే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. 2021 ఐపీఎస్ బ్యాచ్‌మెట్ శివం ఉపాధ్యాయ. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. అతనితో ఐదేళ్లుగా ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. చాలా మంచి సలహాలు ఇస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏఎస్పీగా పని చేస్తున్నారు. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల