
జనరేటర్‌తో ట్రాఫిక్‌జాం
జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్‌లో మంచాల కృష్ణ పెట్రోల్ బంక్ జనరేటర్ రూం రోడ్డుకు అడ్డంగా ఉంది. ట్రాఫిక్‌తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదు. జనరేటర్ రూంను తొలగించాలి. యావర్‌రోడ్డును విస్తరించాలి. – బీజేపీ నాయకులు
ఫేక్ డాక్యుమెంట్లతో బెదిరింపులు
బీర్‌పూర్ పరిధిలోని సర్వే నంబర్ 333/1/1, 333/2లోని స్థలాన్ని నిజామాబాద్ జిల్లా నూతిపెల్లికి చెందిన దేవర సంజీవరాజు, తండ్రి రాంజీవన్‌రావు వద్ద డీ–1ఫాం సర్టిఫికెట్ ఆధారంగా 2009లో 44 మందిమి రెండు గుంటల చొప్పున కొన్నాం. ఆ స్థలంలో రేకుల షెడ్లు నిర్మించుకుని 16 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాం. ఇటీవల వంగపెల్లి చంద్రశేఖర్‌రావు అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లు చూపుతూ ఈ స్థలం తనదని, ఖాళీ చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరిస్తున్నాడు. చంద్రశేఖర్‌రావు నుంచి ఇళ్లు, ప్రాణాలకు రక్షణ కల్పించాలి.
– ఎస్సీ కులస్తులు, బీర్‌పూర్

జనరేటర్‌తో ట్రాఫిక్‌జాం