
భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేయండి
మా అమ్మ చనిపోయింది. మా నాన్న విదేశంలో ఉంటున్నాడు. మా బాగోగులు చూడటం లేదు. అక్కా చెల్లెళ్లిద్దరం అమ్మమ్మతో ఉంటున్నాం. మా అమ్మ చావుకు కారణమైన మా తాత, నానమ్మ మా నాన్న వాటా కింద రావాల్సిన భూమిని అక్రమంగా విక్రయించినట్లు మా బంధువుల ద్వారా తెలిసింది. రేచపల్లి శివారులోని సర్వే నంబర్ 5273/2/4/1/1లోని 1.06 ఎకరాలు, సర్వే నంబర్ 530/జి/1లోని 0.374 గుంటల భూమిని మాకు తెలియకుండా అమ్మకానికి పెట్టారు. అమ్మ లేక.. నాన్న పట్టించుకోక అనాథలమైన మాకు ఏకై క జీవనాధారమైన ఆ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోండి.
– మౌనిక చైత్ర, ఇయాన్సి, రేచపల్లి