
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గన్నేరువరం(మానకొండూర్): మండల కేంద్రంలో అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. పబ్బతి చంద్రయ్య(40) ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి ఐదునెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందున్న చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య ప్రమీల ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
అమెరికాలో సింగరేణి కార్మికుడి మృతి
● ఇండియాకు శవాన్ని తీసుకొచ్చే యత్నంలో బంధువులు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–3 పరిధిలోని ఓసీపీ–2లో పనిచేస్తు గోదావరిఖనిలో పవర్‌హౌస్ కాలనీలో నివాసముంటున్న పెరక ప్రకాశ్(54) అమెరికాలో ఇటీవల మృతి చెందాడు. ఆయన కూతురు అమెరికాలోని అస్ట్రిన్ నగరంలో ఉండగా.. అక్కడికి వెళ్లి మరణించాడు. మృతదేహాన్ని ఇండియాకు పంపించడానికి అక్కడి బంధువులు గోఫండ్‌మీ పేజీ ఏర్పాటు చేసి సాయంకోసం ఎదురుచూస్తున్నా రు. అక్కడి తానా ప్రతినిధులతో మాట్లాడి శవా న్ని గోదావరిఖనికి తీసుకురావాలనే యోచనలో బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, చిన్న కూతురి వద్దకు వెళ్లిన సమయంలో ఈసంఘటన జరిగింది.
గంజాయి తరలిస్తున్న బాలుడిపై కేసు
వెల్గటూర్: గంజాయి తరలిస్తున్న బాలుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్గటూర్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మండలంలోని మొక్కట్రావుపేట శివారులో పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బాలుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని తనిఖీ చేయగా 110 గ్రాముల గంజాయి దొరికింది. బాలుడిది ముత్తునూర్ గ్రామంగా గుర్తించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
ఏడుగురిపై..
మెట్‌పల్లి: మెట్‌పల్లి క్లబ్ సొసైటీ స్థల విక్రయ వ్యవహారంలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ సోమవారం తెలిపారు. క్లబ్ ఆస్తులను గుట్టుగా విక్రయించి మోసానికి పాల్పడుతున్నారని దొంతుల వెంకటేశ్వర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధ్యక్షుడు చెట్లపల్లి నరేందర్‌గౌడ్‌చ గంగుల వివేక్, వేముల కిషన్, దొంతుల సుధాకర్, వేముగంటి భూమేశ్వర్, నీల రాజు, వేముల అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య