
రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించండి
కరీంనగర్‌టౌన్: పెండింగ్‌లో ఉన్న కరీంనగర్–జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన ఆయన కరీంనగర్–జగిత్యాల విస్తరణ పనులతో పాటు సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ (సీఆర్‌ఐఎఫ్) మంజూరు అంశాలపై చర్చించారు. కరీంనగర్ నుంచి జగి త్యాల వరకు ఫోర్‌లేన్ విస్తరణకు ఎన్నికలకు ముందే కేంద్రం రూ. 2151 కోట్ల 35 లక్షల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలు రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఐఎఫ్) ను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. మొత్తం రూ.113 కోట్లతో కూడిన సీఆర్‌ఐఎఫ్ ప్రతిపాదనలను గడ్కరీకి సమర్పించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట–ఖాజీపూర్ రోడ్డులో భాగంగా మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జితోపాటు గన్నేరువరం మండలం గుండ్లపల్లి–పొత్తూర్ రోడ్డు విస్తరణ పనులు, చందుర్తి నుంచి మోత్కురావుపేట వరకు వంతెనల నిర్మాణ పనులు, కిష్టంపల్లి వరకు రోడ్డుపై వంతెన నిర్మాణ ం, శంకరపట్నం మండలం అర్కండ్ల (గ్రామం) నుంచి కన్నాపూర్ (గ్రామం) వరకు వరద కాలు వపై హై లెవల్ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే సీఆర్‌ఐఎఫ్ నిధులు విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి