
సరస్వతీ పుత్రునికి అందిన లక్ష్మీకటాక్షం
తిమ్మాపూర్: కూలిపనులు చేసుకుంటూ బతికే మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ–శంకర్ దంపతుల కొడుకు మహేశ్ గత ఎప్రిల్‌లో విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 453 (ఎస్సీ విభాగంలో 17)వ ర్యాంకు సాధించాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎన్‌ఐటీలో ఆర్కిటెక్చర్ సీటు దక్కించుకున్నాడు. ఫీజుకట్టలేని పరిస్థిలో తల్లిదండ్రులు ఉండడంతో మహేశ్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ పీఏ మురళీధర్ రెడ్డి విద్యార్థికి ఎలాగైనా సహాయం చేయాలని తలిచి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, అధికారుల సహకారంతో రూ.3.30 లక్షలు సమీకరించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థి మహేశ్‌కు అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో పేదలకు సాయం చేయాలని, విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన దాతలు అభినందించారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, తహసీల్దార్లు శ్రీనివాసరెడ్డి, విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఎస్‌ఎల్ గౌడ్, ఒగ్గు దామోదర్, బండారి రమేశ్, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, మోరపల్లి రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పీఏ మురళీధర్ రెడ్డి
స్పందించి సాయం చేసిన నేతలు