
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలింపు
– ఆత్మకూర్ రీచ్ నుంచి 29 ట్రాక్టర్ల తరలింపు
మెట్‌పల్లి రూరల్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేసింది. మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ రీచ్ నుంచి 10 మంది లబ్ధిదారుల కోసం 29 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక తీసుకెళ్లినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇసుక పక్కదారి పట్టకుండా రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. ముందుగా వాగు నుంచి ఇసుక తీయొద్దని కొందరు గ్రామస్తులు అడ్డగించడంతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో శాంతించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలియకపోవడంతో ఈనెల 25 న ‘ఇందిరమ్మకు ఉచిత ఇసుక’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో చాలామంది లబ్ధిదారులు పంచాయతీ, రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులు వారికి ఇసుకను సరఫరా చేశారు.