
క్రీడా మైదానానికి స్థలం కేటాయించండి
జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లో క్రీడా మైదానం లేదు. వాకింగ్, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ ఆడేందుకు మైదానం లేక ఇబ్బంది పడుతున్నాం. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులకు పలుమార్లు విన్నవించాం. మేజర్ పంచాయతీ అయిన చల్‌గల్‌లో క్రీడామైదానం ఏర్పాటు చేస్తే మోరపల్లి, చర్లపల్లి, హస్నాబాద్, తాటిపల్లి ప్రజలకు వాకింగ్‌తో పాటు క్రీడలు ఆడేందుకు సౌకర్యంగా ఉంటుంది.
– చల్‌గల్ గ్రామ యువకులు
రోడ్లు వేయండి
భవానీనగర్ కాలనీని అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం పడితే రోడ్లన్నీ బురదలా మారుతున్నాయి. కొన్ని కాలనీల్లో రోడ్లు ఉన్న చోటే తిరిగి రోడ్లు వేస్తున్నారు. మా కాలనీలో మాత్రం పట్టించుకోవడం లేదు. వివక్ష లేకుండా మా కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించండి.
– భవానీనగర్ కాలనీ, జగిత్యాల

క్రీడా మైదానానికి స్థలం కేటాయించండి