
మల్లికార్జున స్వామి సన్నిధిలో గండదీపం
మల్లాపూర్: మండలంలోని రత్నాపూర్ శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం అఖండ(గండ) దీపాన్ని అర్చకులు వెలిగించారు. ఏటా శ్రావణమాసం మొదటి ఆదివారం ఆలయంలో దీపం వెలిగిస్తామని, శ్రావణమాసం పూర్తయ్యే వరకు.. పొలాల అమావాస్యదాకా వెలుగుతూనే ఉంటుందని అర్చకులు శివకుమార్ తెలిపారు. దీపం వెలిగినన్ని రోజులు రత్నాపూర్‌లో ఎవరూ మాంసం తినరు, మద్యం ముట్టరు. ఇది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. శ్రావణమాసంలో ప్రతి ఆదివారం భక్తులు స్వామివారికి భోనాలు సమర్పిస్తారు. పొలాల అమావాస్య రోజు అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నల్ల నర్సయ్య తెలిపారు.