
పరిశుభ్రత అందరి బాధ్యత
జగిత్యాల: పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యతని, ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పరిశుభ్రత వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. జగి త్యాల మున్సిపాలిటీలో పచ్చదనాన్ని పెంచి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చూడాలన్నారు. పట్టణ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించ డం జరిగిందని, గ్రీన్ బడ్జెట్‌లో పచ్చదనానికి ని ధులు కేటాయించడం జరుగుతుందన్నారు. నా యకులు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, పవన్, రాజ్‌కుమార్, రాము, సుధాకర్ పాల్గొన్నారు.
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రాయికల్(జగిత్యాల): అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.12.50 లక్షలతో వాటర్ సప్‌లై, రూ.20 లక్షలతో డివైడర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 27 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్, 80 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఇటిక్యాలకు చెందిన పంచతి మల్లవ్వ, రాయికల్‌కు చెందిన రవితేజకు దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి రూ.50 వేలు మంజూరు కాగా అందజేశారు. విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, గండ్ర రమాదేవి, నాయకులు పాల్గొన్నారు.