
27న లైసెన్స్‌డ్ సర్వేయర్లకు రాత పరీక్ష
జగిత్యాల: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఏడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు పాస్‌పోర్టు సైజు ఫొటోను నిర్దేశించిన ప్రదేశంలో అతికించి జిల్లా సర్వే అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలన్నారు. అలా ధ్రువీకరించిన హాల్ టికెట్స్‌తోనే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. ఏవైనా సందేహాలుంటే 99669 88002 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష హాల్‌కు రావాలని సూచించారు.
ఇద్దరు ఎస్సైల బదిలీ
జగిత్యాలక్రైం: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల డీసీఆర్బీ ఎస్సైగా పనిచేస్తున్న రవికిరణ్‌ను జగిత్యాల టౌన్, జగిత్యాల ఎస్బీ ఎస్సై మహేశ్‌ను కోరుట్ల–2 ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
విషజ్వరాల కట్టడికి చర్యలు తీసుకోవాలి
మల్లాపూర్(కోరుట్ల): గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో విషజ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విషజ్వరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అర్చన, డాక్టర్ రవీందర్, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, జిల్లా పర్యవేక్షకులు మురళి, శ్యామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.