
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
గొల్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల కోసమే ఇందిరమ్మ ఇళ్లు అందిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు అత్తెన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లుమంజూరు పత్రాన్ని అందించారు. నిరుపేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌నాయకులు పాల్గొన్నారు.
వసతుల కల్పనకు కృషి
గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. మండలకేంద్రంలోని శ్మశా న వాటికకు సరైన రహదారి లేక గ్రామస్తులు ఇబ్బ ంది పడుతున్నారు. వారి సమస్యను మంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. శ్మశాన వాటికకు దారికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.