
రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు
వెల్గటూర్: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. వెల్గటూర్ మండలంలో గురువారం పర్యటించిన ఆయన పీఏసీఎస్‌లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో మందుల నిల్వలను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. రోగులకు ఇబ్బంది లేకుండా చికిత్స అందించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, సహకార అధికారి మనోజ్ కుమార్, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో సాయికిరణ్, సంఘ చైర్మన్ రత్నాకర్ సిబ్బంది పాల్గొన్నారు.