
● పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు
బీజేపీ సత్తా చూపాలి
రాయికల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు కార్యకర్తలకు సూచించారు. గురువారం రాయికల్ పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ కన్వీనర్ శ్రీనివాస్, పార్లమెంట్ కో–కన్వీనర్ సదాశివ్, మండల ఇన్‌చార్జి రాగిల్ల సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్ ముత్యంరెడ్డి, మహిళామోర్చ జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, మండల అధ్యక్షుడు మహేశ్, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి పాల్గొన్నారు.