
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
సారంగాపూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ అన్నారు. గురువారం బీర్‌పూర్ మండల కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై సమాయత్త సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగిందన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని, అలాగే బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిచాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సుమన్‌గౌడ్, విండో మాజీ చైర్మన్ మెరుగు రాజేశం, నాయకులు రామన్న, జతేందర్, శ్రీనివాస్, రాంచంద్రం, సుధాకర్, లింగన్న, మల్లేశం, రామయ్య, రాజేష్, మాజీ సర్పంచ్ రవీందర్, మల్లేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
కల్లెడలో..
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో కల్లెడ, తక్కళ్లపల్లి, సంగంపల్లి, సోమన్‌పల్లి, గుల్లపేట, అనంతారం, హబ్సీపూర్, పొలాస, గుట్రాజ్‌పల్లి గ్రామాల బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వసంత మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించాలన్నారు. కల్లెడ, జగిత్యాల సింగిల్ విండో చైర్మన్లు సందీప్‌రావు, మహిపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.