జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం

Jul 24 2025 7:14 AM | Updated on Jul 24 2025 7:14 AM

జిల్ల

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో బుధవారం ఉద యం 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ధర్మపురి మండలం నేరెళ్లలో 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కథలాపూర్‌లో 9.8 మి.మీగా నమోదైంది. సారంగాపూర్‌లో 79.3, ఎండపల్లి మండలం గుల్లకోటలో 73.5, బీర్‌పూర్‌ మండలం కొల్వాయిలో 54.8, మేడిపల్లిలో 49.8, గొల్లపల్లిలో 48.8, బుగ్గారం మండలం సిరికొండలో 47.3, ఎండపల్లిలో 41.8, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 41.8, కోరుట్లలో 40.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

నృసింహుడి సన్నిధిలో రద్దీ

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ముందుగా గోదావరిలో స్నానాలు చేశారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్నారు.

ఘనంగా మహా లింగార్చన

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా లింగార్చన నిర్వహించారు. రుద్రనమకం, మాన్యసూక్తం, లక్ష్మీసూక్తం, పురుష సూక్తం తదితర పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ జక్కు రవీందర్‌, సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

బాక్సింగ్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు

జగిత్యాల: సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాదం మహేందర్‌, గువ్వ శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 25, 26, 27 తేదీల్లో షేక్‌పేట్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో జిల్లా తరఫున దుగ్యాల రాఘవరావు, పాదం హర్షిత్‌పటేల్‌, స్వరాలి, మోక్షిత, విద్యాదీప్‌, అక్షయ్‌వర్మ, రిశ్వాంత్‌, శశాంక్‌ పాల్గొంటారని వారు పేర్కొన్నారు.

‘సూరమ్మ’ కాలువల భూసేకరణకు రూ.10కోట్లు మంజూరు

కథలాపూర్‌: మండలం కలిగోట శివారులోగల సూరమ్మ ప్రాజెక్ట్‌ నుంచి కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణకు ప్రభుత్వం రూ.10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోవడంతో కాలువల నిర్మాణాలపై దృష్టి సారించామని, కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం మండలా ల్లోని గ్రామాల్లో భూముల సర్వే పూర్తయింద ని, ఈ మేరకు భూములకు రూ.10 కోట్లు కలెక్టర్‌ ఖాతాలో జమ అయ్యాయని వివరించారు.

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

రాయికల్‌: సీపీఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పొన్నం రమేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మండలంలోని ఇటిక్యాల, బోర్నపల్లి, చింతలూరు, ఒడ్డెలింగాపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. మోడల్‌స్కూల్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, హెల్త్‌కార్డు అమలు చేయాలన్నారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అంతడుపుల గంగరాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి లక్కడి రాజిరెడ్డి, జిల్లా కార్యదర్శి దొంతి సతీశ్‌ పాల్గొన్నారు.

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం
1
1/3

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం
2
2/3

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం
3
3/3

జిల్లాలో 91 మిల్లీమీటర్ల వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement