
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
జగిత్యాల: అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 11వ వార్డులో రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డుకు బుధవారం భూమిపూజ చేశారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో వసతుల కల్పనకు రూ.20 కోట్లు, గాంధీనగర్‌లో రూ.18 కోట్లతో బ్లాక్‌స్పాట్ రోడ్లు, రూ.16 కోట్లతో జగిత్యాల–తిప్పన్నపేట రోడ్డు మంజూరైందన్నారు. ధరూర్ క్యాంప్‌లో రూ.5కోట్లతో ఇందిరమ్మ శక్తి భవనం నిర్మిస్తామన్నారు. కమిషనర్ స్పందన, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, బాలె లత, చంద్రయ్య పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేను అద్దె బస్సుల యజమానుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్‌లో రూ.15లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించే.. బాలపల్లిలో రూ.20లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. పట్టణాలతోపాటు గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రమాదేవి, డీఈ మిలింద్, నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించాలి
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని అర్పపల్లి, రేచపల్లిలో రూ.54 లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. తహసీల్దార్ వహిదోద్దీన్, ఎంపీడీవో గంగాధర్, విండో అధ్యక్షులు మల్లారెడ్డి, నర్సింహ్మరెడ్డి ఉన్నారు.
మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీకి మహర్దశ
జగిత్యాలటౌన్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ దశ తిరిగిందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో మహిలక్ష్మి సంబరాలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జగిత్యాల డిపో మేనేజర్ కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైర్ బస్ అసోసియేషన్ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్