
పాపం.. దయనీయం
● ఈమె పేరు లక్ష్మీ. ఈమె కుమారుడు వెంకట్‌రెడ్డి రాజేశ్ నెల క్రితం కోరుట్లలో జరిగిన కరెంట్ షాక్ ఘటనలో గాయపడి చావుబతుకుల్లో ఉన్నాడు. ఇప్పటికే రూ.10 లక్షల దాకా ఖర్చయ్యింది. కొడుకును రక్షించుకునేందుకు ఆర్ధిక సాయం చేయండి అని అర్థిస్తోంది.
● ‘కరెంటు షాక్‌తో నా పెద్ద కొడుకు వెల్లుట్ల సాయికుమార్ అక్కడికక్కడే చనిపోయిండు. రెండో కొడుకు కృష్ణ తీవ్రంగా గాయపడగా ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించినం. నెల గడిచింది. ఒక చేయి తొలగించారు. మేం నలుగురం ఆసుపత్రి దగ్గర ఉండేందుకు రూ.లక్షకుపైగా ఖర్చు వచ్చింది. కూలీనాలీ చేసుకునేటోళ్లం. చేయిచాచి అడగాలంటే పాణం పోయినంత పనైతంది. బంగారం అమ్మి ఖర్చు పెడుతున్నం..’ ఇది కృష్ణ తల్లి రేఖ ఆవేదన.

పాపం.. దయనీయం

పాపం.. దయనీయం