
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
రాయికల్/సారంగాపూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. రాయికల్ పట్టణం, అల్లీపూర్, సారంగాపూర్ మండలం పెంబట్లలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. రాయికల్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఎనగందు ల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, పట్టణ అధ్యక్షుడు అనిల్, కన్వీనర్ తురగ శ్రీధర్‌రెడ్డి, మహేశ్వర్‌రావు, మహేందర్, పోతుగంటి రాజేందర్‌గౌడ్, సారంగాపూర్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, బీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు తేలు రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.