
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
జగిత్యాలరూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో రూ.1.80 కోట్లతో.. చెర్లపల్లిలో రూ.15 లక్షలతో, మోరపల్లిలో రూ.45 లక్షలతో, జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేటలో రూ.20 లక్షలతో, హస్నాబాద్‌లో రూ.30 ల క్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూ మిపూజ చేశారు. హస్నాబాద్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించా రు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీవో విజయలక్ష్మీ, రమాదేవి, ఎంపీవోలు వాసవి, రవిబాబు, డీఈ మిలింద్, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు అభినందనలు
జగిత్యాల: చెర్లపల్లిలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపా రు. వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ వాసు పావని, లైవ్ స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ రాజేందర్ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్‌పై బీజేపీ ద్వంద్వనీతి
సారంగాపూర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కులగణన చేసి బీసీ జనాభా 56 శాతంగా గుర్తించిందని, ఇందులో 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు ఆమోదించాయని, దీనిపై కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. 42శాతం రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, ఎనిమిది రోజులైనా గవర్నర్ ఆమోదం తెలపకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ బీర్‌పూర్, సారంగాపూర్ మండలాల అధ్యక్షులు సుభాష్, రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.
జిల్లాకు మోస్తరు వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు రానున్న ఐదురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధ న స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలి పారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గురువారం అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నాం
మేడిపల్లి: విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలో పర్యటించిన ఆయన పోరుమల్ల, కట్లకుంట, వల్లంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో రూ.60లక్షలతో చేపట్టనున్న అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. మాచపూర్‌లో పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మోడల్‌స్కూల్‌లో రూ.10 లక్షలతో కిచెన్ షెడ్డుకు శంకుస్థాపన చేశారు. పేదలకు ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్ తదితరులు ఉన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం