
స్కూల్‌లో వసతులు బాగున్నాయా..?
కోరుట్లరూరల్: మండలంలోని కల్లూర్ మోడల్ స్కూల్‌ను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని సమస్యలను ప్రిన్సిపాల్ మోహన్, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పాఠ్యాంశాల తీరును పరిశీలించారు. పాఠశాలకు కోరుట్ల నుంచి ఒకటే బస్సు వస్తోందని, ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యేకు తెలపగా మరో బస్సును నడిపించాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. బడిలో విద్యుత్ సమస్య ఉందనగా.. ఏడీతో మాట్లాడారు. హాస్టల్ టాయిలెట్స్‌లో నీరు రావడం లేదని విద్యార్థినులు చెప్పడంతో స్పెషల్ ఆఫీసర్ రజితతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 24 మంది లబ్ధిదారులకు రూ.4,56,500 విలువైన చెక్కులు అందించారు. రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మాజీ కౌన్సిలర్లు సజ్జు, సత్యం, నాయకులు పాల్గొన్నారు.