
ఇంటి నుంచి గెంటేశారని ఠాణా మెట్లెక్కిన వృద్ధులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడకు చెందిన తమను తమ మనుమడు ఇంటి నుంచి గెంటేశారని, న్యాయం చేయాలని వృద్ధ దంపతులు మంగళవారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బీర్‌పూర్ మండలకేంద్రానికి చెందిన అంకం చంద్రయ్య, లక్ష్మీబాయికి కొడుకు, కూతురు సంతానం. 13 ఏళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. హనుమాన్‌వాడలో చిన్న ఇల్లు ఉంది. చంద్రయ్య పేరున ఉన్న ఆ ఇల్లును తన పేరిట రిజిస్ట్రేషన్ మనుమడు సతీశ్ కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. దానికి తాము ఒప్పుకోకపోవడంతో తమను సతీశ్ ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆ వృద్ధ దంపతులను కూతురు మంజూల ఇంటికి తీసుకెళ్లింది. మంజుల ఇంటికి వెళ్లిన సతీశ్ అక్కడ వృద్ధులపై దాడికి ప్రయత్నించాడు. దీంతో వృద్ధ దంపతులు పట్టణ సీఐ కరుణాకర్‌కు ఫిర్యాదు చేసి తమను ఆదుకోవాలని కోరారు.