
క్రెడిట్‌కార్డు పేరిట సైబర్ మోసం
సిరిసిల్లక్రైం: క్రెడిట్‌కార్డు యాక్టివేషన్ పేరిట సైబర్ మోసానికి పాల్పడిన అంతర్ రాష్ట్ర సైబర్ నిందితుడు మహమ్మద్ కలీం పాషాను అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీ సు ఆఫీస్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని చింతల్, వెంకటరామిరెడ్డినగర్‌కు చెందిన మొహమ్మద్ కలీం పాషా తనకు పరిచయం ఉన్న హైదరాబాద్‌కు చెందిన రషీద్ వ్యసనాలకు బానిసయ్యారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో సులువుగా మోసగించవచ్చని ఆలోచించారు. రషీద్‌కు పరిచయం ఉన్న కోల్‌కతలోని అంకిత్ వద్దకు గత ఫిబ్రవరిలో ఇద్దరు వెళ్లి ఆన్‌లైన్ ద్వారా ప్రజలను ఎలా మోసాగించాలో నేర్చుకున్నారు. ఈక్రమంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన సురేష్‌కుమార్ క్రెడిట్‌కార్డు యాక్టివేట్ చేస్తానని ఆన్‌లైన్ కస్టమర్ కేర్ అంటూ మాట్లాడి మోసం చేశారు. దీంతో బాధితుడు సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిరిసిల్ల పట్టణ పోలీసులు జిల్లా సైబర్‌టీం ఆర్‌ఎస్‌ఐ జునైద్, గంగారెడ్డి, కిట్టు, మహేశ్ ఆధ్వర్యంలో టీమ్ ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా శనివారం హైదరాబాద్‌లో పట్టుకున్నారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. అంతర్‌రాష్ట్ర సైబర్ మోసగాడిని పట్టుకోవడంలో కృషిచేసిన సైబర్ ఆర్‌ఎస్‌ఐ జునైద్, సైబర్ టీమ్ గంగరెడ్డి, కిట్టు, మహేశ్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌లను ఎస్పీ అభినందించారు.
సైబర్ మోసగాడి అరెస్ట్
ఎస్పీ మహేశ్ బీ గీతే