
చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని..
● పోరుబాట పట్టిన బీజేపీ ● మల్లాపూర్ నుంచి ముత్యంపేట వరకు పాదయాత్ర
మల్లాపూర్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని బీజేపీ పోరుబాట పట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ ఫ్యాక్టరీ ఏకై క వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా కొనసాగాయి. అలాంటి ప్యాక్టరీని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆదివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్ధమైంది. మండలకేంద్రంలోని సోమేశ్వర కొండ వద్ద పూజలు చేసి ముత్యంపేటలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్రలో చెరుకు రైతులందరూ పాల్గొనాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర ప్రారంభానికి జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరవుతున్నారు. ఫ్యాక్టరీ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చెరుకు రైతులతో కొనసాగే పాదయాత్ర ము గింపు సభకు బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు బోగ శ్రావణి, వడ్డెపల్లి శ్రీనివాస్ పాల్గొనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.