జగిత్యాల: జిల్లాకేంద్రంలోని టీచర్స్ భవన్‌లో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ అవార్డ్స్ అవగాహన సదస్సు శనివారం ముగిసింది. సమావేశంలో డీఈవో రాము పాల్గొన్నారు. సమాజంలోని సమస్యలను విద్యార్థులు గుర్తించేలా చేసి.. వాటిని ఒక పేపర్‌పై రాసి.. పరిష్కారానికి అవసరమైన ఐడియాను బాక్స్‌లో వేయించాలని, అందరితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొనేలా చేయాలని సూచించారు. ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే నూతన ఆవిష్కరణలే జాతీయస్థాయికి ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి నాణ్యమైన, ఉత్తమమైన ఆలోచనలతో నామినేషన్లు వేసేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ రిసోర్స్ పర్సన్ మల్లేశం, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, గైడ్ టీచర్ శారద పాల్గొన్నారు.