
విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
● ఎమ్మెల్సీ ఎల్.రమణ
జగిత్యాలరూరల్: విద్యార్థులు విద్యతోపాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్‌స్కూల్ విద్యార్థులకు ఎల్జీరామ్ హెల్త్‌కేర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో శిబిరం నిర్వహించామని పేర్కొన్నారు. డీఈవో రాము, ఎంఈవో గాయత్రి, ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంవో సుమన్‌మోహన్‌రావు, శ్రీపతి, సెక్టోరియల్ అధికారి రాజేశ్, ప్రిన్సిపల్ సరితాదేవి, వైస్ ప్రిన్సిపల్ నగేశ్, వైద్యులు, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి అయిల్నేని సాగర్‌రావు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటలో శనివారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వర్షకాలం నేపథ్యంలో శుద్ధి చేసిన నీటిని తాగాలన్నారు. మురికికాలువలను శుభ్రం చేయించాలని, తాగునీటి బావుల్లో క్లోరినేషన్ చేయాలని పంచాయతీలకు సూచించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్‌వేయాలని, దోమలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యురాలు సౌజన్య, ఏఎన్‌ఎం శోభ, ఎస్‌టీఎస్ శ్రీనివాస్, తిరుపతి, ఎన్జీవో శ్రావణ్య పాల్గొన్నారు.
యమధర్మరాజుకు పూజలు
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, సూపరింటెండెంట్ కిరణ్ ఉన్నారు.
విద్యుత్ ప్రమాదాలు నివారించాలి
● ఎస్‌ఈ సుదర్శనం
మల్యాల: విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, పనిచేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల విద్యుత్ సిబ్బందికి ప్రమాదాల నివారణ, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తల తీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రక్షణ చర్యలు తీసుకోకుంటే రూ.మూడువేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డీఈ టెక్నికల్ సేఫ్టీ గంగారాం, డీఈ రాజిరెడ్డి, ఏడీఈ వరుణ్‌కుమార్, మహేందర్, ఏఏఓ లక్ష్మీనారాయణ, ఏఈ దయానంద్, శ్రీనివాస్, రఘునాథ్, నగేశ్, రాకేశ్, మధు, వెంకటరెడ్డి, సబ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి

విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి

విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి