
మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం
● వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్: మహిళలను అన్నిరంగాల్లో బలోపేతం చేసి కోటీశ్వరులను చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో శనివారం ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి ఇవ్వనున్న అద్దె బస్సును ప్రారంభించారు. వడ్డీ రాయితీ కింద 4,683 స్వశక్తి సంఘాలకు రూ.5.70 కోట్లు, సీ్త్రనిధి బ్యాంకు ద్వారా 40 సంఘాలకు రూ.32 లక్షల చెక్కు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశా రు. మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు ప్రమాద బీమా, లోన్ బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక వృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడిపశువుల పెంపకం, శక్తి క్యాంటీన్లు, బస్సులు అప్పగించినట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 127 స్కూళ్లకు మరమ్మతు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, ఏపీఎం చంద్రకళ, ఏఎంసీ చైర్మెన్ గోపిక పాల్గొన్నారు. మండ లకేంద్రంలోని అయ్యప్ప ఆలయానికి రూ.4లక్షలు విరాళం అందించారు. గతంలో రూ.లక్ష ఇచ్చారు.
రైతులు, చిరువ్యాపారుల సమస్య పరిష్కరిస్తాం
ధర్మపురి: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో రైతులు, చిరువ్యాపారులు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తామని మంత్రి అన్నారు. చింతామణి చెరువు పక్కన నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సందర్శించారు. వ్యాపారుల కోరిక మేరకు ఎత్తుగా ఉన్న గద్దెలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ధర్మపురికి నిత్యం వచ్చే వేలాది మంది భక్తులకు వసతులు కల్పించాలన్నారు. తాగునీటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, బోల్ చెరువు, అమృత్–2 పథకంలో భాగంగా అక్కపెల్లి చెరువు ఎత్తిపోతలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.