
పేదల సొంతింటి కల సాకారం చేస్తాం
● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: గత పాలకుల వైఫల్యంతో దశాబ్దకాలం ఆలస్యమైనా, తమ ప్రభుత్వం ప్రతీ నిరుపేద సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీగార్డెన్స్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మార్గదర్శకాలు రూపొందించి పథకాలు అమలు చేస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
రహదారి సమస్య పరిష్కరిస్తా
జగిత్యాల పట్టణంలోని పార్క్ సంది నుంచి కొత్తబస్టాండ్ రోడ్డును కలిపే దారి సమస్యను పరిష్కరిస్తానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వర్షపు నీరు రోడ్డుపై నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రోడ్డును పరిశీలించి బల్దియా అధికారులతో మాట్లాడారు. పార్క్ దారి ఆధునీకరణకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు కల్లెపెల్లి దుర్గయ్య, కొత్త మోహన్, గాజుల రాజేందర్, హరికృష్ణ, శేఖర్, రమేశ్, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులున్నారు.