
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
మల్లాపూర్(కోరుట్ల): పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సేష్టన్‌లోని రికార్డులు, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్, విజుబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది 100 డయల్ కాల్స్‌కి వెంటనే స్పందిస్తూ ఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అధునాతన టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ రాములు, సీఐ అనిల్‌కుమార్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మేడిపల్లి ఎస్సైలు రాజు, అనిల్, చిరంజీవి, శ్రీధర్‌రెడ్డి, రాజునాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
● ఎస్పీ అశోక్‌కుమార్