
భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండలంలోని వర్షకొండ శివారులో ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాగా శుక్రవారం మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ పరిశీలించారు. సర్వేనంబర్ 311లో 76.30 ఎకరాల భూమి ఉంది. సదరు భూమిలో వర్షకొండలో పనిచేసిన వీఆర్‌ఏ సల్కం తిరుపతికి 35 గుంటలకు పట్టా ఉండగా, మరికొంత మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన భూమిని కొందరు చదును చేస్తూ మొరం అమ్ముకుంటుడడంతో పాటు 10 ఎకరాల భూమిని మంగిలిపెల్లి మహిపాల్‌కు రూ.82 లక్షలకు విక్రయించారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన దోస భూమేశ్వర్, తుమ్మల నర్సయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో, తహసీల్దార్ వరప్రసాద్ కబ్జాకు గురైన భూమిని పరిశీలించి మాట్లాడారు. సర్వేనంబర్ 311లోని మొత్తం భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీఏవో దేవరాజ్, సర్వేయర్ భార్గవి, ఆర్‌ఐ రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.