మృతుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతిలో హతులైన మృతుల కుటుంబాలను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాద ముష్కరులు చేసిన దాడిలో 28 మంది మృతి చెందడం.. 20 మంది వరకు గాయపడడం బాధాకరమని తెలిపారు.
బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలి
జగిత్యాల: పాకిస్థాన్ ముష్కరుల ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణరహితంగా దాడిచేసి చంపడాన్ని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఖండించారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. ఉగ్రవాదుల చేతిల్లో పర్యాటకులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారిని తక్షణమే ఆదుకోవాలన్నారు.
మృతుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి


