
జ్యోతినగర్: గుండెపోటుతో మున్సిపల్ సీనియర్ కాంట్రాక్టర్ గడ్డం(సుందిల్ల) నారాయణగౌడ్(59) బుధవారం మృతిచెందాడు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న రామగుండం మున్సిపల్ సీని యర్ కాంట్రాక్టర్ నారాయణగౌడ్ ఉదయం అస్వస్థతకు గురి కాగా.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందించే లోపు మృతిచెందాడు. మృతుడికి భార్య విజయతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. పలువురు కాంట్రాక్టర్లు, గౌడ సంఘం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.