కార్మికుడి చెత్త పని : కంపెనీ క్లోజ్‌! | Worker Bathing In Milk Of Tub Dairy Shut Down In Turkey | Sakshi
Sakshi News home page

పాల టబ్బులో స్నానం: డైరీ కంపెనీ క్లోజ్‌!

Nov 9 2020 8:45 PM | Updated on Nov 9 2020 8:51 PM

Worker Bathing In Milk Of Tub Dairy Shut Down In Turkey - Sakshi

వీడియో దృశ్యాలు

టిక్‌టాక్‌ వీడియో మోజులో పడి ఓ కార్మికుడు తనతో పాటు కంపెనీని కూడా వీధుల్లోకి తీసుకువచ్చాడు....

అంకారా: టిక్‌టాక్‌ వీడియో మోజులో పడి ఓ కార్మికుడు తనతో పాటు కంపెనీని కూడా వీధుల్లోకి తీసుకువచ్చాడు. పాల డైరీలో పని చేసే అతడి వెధవ పనికి ఏకంగా డైరీ కంపెనీనే మూతపడింది. ఈ సంఘటన టర్కీలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. టర్కీ, కోన్యాలోని సెంట్రల్‌ అనాటోలియన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఎంమ్రీ సయర్‌ అనే వ్యక్తి అక్కడి ఓ పాల డైరీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం టిక్‌టాక్‌ వీడియోకోసం డైరీలోని పాల టబ్బులోకి దిగి స్నానం చేశాడు. ( బీట్‌ రూట్‌ రసం కాదు.. నదిలోని నీళ్లు..! )

ఆ టిక్‌టాక్‌ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఎంమ్రీతో పాటు వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా సదరు డైరీ కంపెనీని మూసి వేయాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోన్యా అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యల కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement