Woman Delivers Two Sets Of Identical Twins At The Same Time - Sakshi
Sakshi News home page

అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జంట కవలలు, కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా!

Aug 1 2022 3:02 AM | Updated on Aug 1 2022 8:58 AM

Woman Delivers Two Sets Of Identical Twins At The Same Time - Sakshi

ఇలాంటి ‘కోటిలో ఒక్కరు’ఇంతకుముందు కూడా జరిగాయి. కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ... 15 నిమిషాల తేడాతో కవలలకు జన్మనిచ్చింది. ముందుగా బాబు 2021 డిసెంబర్‌ రాత్రి 11.45 గంటలకు జన్మిస్తే... 15 నిమిషాల తరువాత.. అంటే 2022 జనవరి ఒకటిన అర్ధరాత్రి పన్నెండుకు పాప జన్మించింది.

కవలలను సాకడం తల్లిదండ్రులకు  ఎంతో కష్టం. అలాంటిది ఒకేసారి కవలల జంట పుడితే! బాప్‌రే అనుకుంటున్నారా? అలాంటి అరుదైన ఘటన బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లో జరిగింది. యాష్లీ నెస్‌ అనే మహిళకు ఒకే కాన్పులో ఒకేతీరుగా ఉన్న ఇద్దరు కవలల (ఐడెంటికల్‌ ట్విన్స్‌) జంట జన్మించారు. ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు... మొత్తానికి నలుగురు పిల్లలు జూలై 28న పుట్టారు. కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇచ్చిన కాన్పు తేదీ కంటే.. పన్నెండువారాలు ముందుగా పుట్టారు.  

ఇలాంటి ‘కోటిలో ఒక్కరు’ఇంతకుముందు కూడా జరిగాయి. కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ... 15 నిమిషాల తేడాతో కవలలకు జన్మనిచ్చింది. ముందుగా బాబు 2021 డిసెంబర్‌ రాత్రి 11.45 గంటలకు జన్మిస్తే... 15 నిమిషాల తరువాత.. అంటే 2022 జనవరి ఒకటిన అర్ధరాత్రి పన్నెండుకు పాప జన్మించింది. ఇండియానాలోనూ 2019 డిసెంబర్‌ 31న ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది... కాకపోతే పిల్లలిద్దరికి అర్థగంట తేడా అన్నమాట.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement