వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుంది. అది జరగొద్దని అనుకుంటున్నా. కానీ జరుగుతోంది. ఆ నాగరికతను తిరిగి వెనక్కి తీసుకురావడం అసాధ్యం. ఇరాన్‌లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతుంది’అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, అమెరికా భారీ దాడులు చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. అదే సమయంలో ఇరాన్‌లోని ఓ నాగరికత అంతం’ అని పేర్కొన్నారు.
అదే సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికా ‘రెడ్ లైన్స్’ దాటితే ప్రాంతం బయట కూడా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. అమెరికా, దాని మిత్రదేశాలకు చాలా సంవత్సరాల పాటు చమురు,ఇతర సహజ వనరులు అందకుండా చేస్తామని తెలిపింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ, ట్రంప్ ఈ ఆందోళనలను పట్టించుకోకుండా పూర్తి విధ్వంసం జరగబోతుందని స్పష్టంచేశారు.
ఇరాన్ ఇప్పటికే అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించడానికి సిద్ధమవుతుండగా..‘నాగరికత నశనం’అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియా యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ప్రపంచ చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


