ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పులు.. దుండగులు హతం | Two Dead After Shooting Attempt At Israeli Consulate In Turkey Istanbul, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పులు.. దుండగులు హతం

Apr 7 2026 4:09 PM | Updated on Apr 7 2026 4:52 PM

 Shooting at Israeli consulate in Turkey

టర్కీలోని ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పుల కలకలం రేగింది. ఇస్తాంబుల్‌లోని కార్యాలయం వద్ద ముగ్గురు దుండగులు కాల్పుల యత్నం చేశారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే స్పందించి వారిని మట్టుబెట్టాయి. మరోకరిని అదుపులోకి తీసుకున్నాయి.

ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట లాంగ్‌ బారెల్‌ గన్స్‌తో ముగ్గురు వ్యక్తులు కాల్పులకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే కాల్పుల ఘటనతో కాన్సులేట్ ఎదుట భారీగా భద్రత మోహరించినట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు.

టర్కీ అధికారులు ఈ దాడిని అధికారికంగా గుర్తించారు. అయితే దాడి చేసిన వారి వివరాలు, ఎందుకు చేశారు అనే కారణాలు వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement