Gorilla Glue Spray For Hair: జుట్టు అందంగా ఉండాలని గ్లూ‌ వాడిన యువతి.. - Sakshi
Sakshi News home page

జుట్టు అందంగా ఉండాలని గ్లూ‌ వాడిన యువతి..

Feb 9 2021 12:57 PM | Updated on Feb 9 2021 3:25 PM

What Happend After Woman Used Gorilla Glue Spray Instead Of Hair Spray - Sakshi

అందం అ‍మ్మాయిల హక్కుగా ఫీల్‌ అవుతుంటారు. తయారవడం కోసం ఎన్ని గంటలైనా వెచ్చిస్తారు. అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అమ్మాయిలు ఎక్కువగా కేర్‌ తీసుకునే అంశాల్లో ముఖం తరువాతి స్థానం జుట్టుకే. పొడవైన, మృదువైన కురులంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ​​​జుట్టు అందంగా, స్టైల్‌గా ఉండేందుకు చాలా మంది వివిధ రకాల క్రీమ్‌లు, స్ప్రేలు వాడుతుంటారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యువతి వినూత్నంగా ఉంటుందని జుట్టుకు గ్లూ(జిగురు, గమ్) స్ప్రే వాడి ఇబ్బందుల్లో పడింది. లూజియానా రాష్ట్రానికి చెందిన టెస్సికా బ్రౌన్ అనే యువతి హెయిర్ స్ప్రే అయిపోయిందని గొరిల్లా గ్లూ అనే స్ప్రేను తన జట్టుకు రాసుకుంది. ఈ స్ప్రే తన జుట్టుకు వాడిన వెంటనే జుట్టు మొత్తం గ్లూ కారణంగా అతుక్కుపోయింది.

తన జుట్టును తిరిగి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ జుట్టు మాత్రం మామూలు స్థితికి రాలేదు. ఈ విషయాన్ని ఈ నెల 4వ తేదీన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా  బ్రౌన్‌ వెల్లడించారు. ‘ఈ నెల రోజుల వ్యవధిలో తాను 15 సార్లు తలకు స్నానం చేశాను. కానీ జుట్టు మాత్రం మామూలు స్థితికి రాలేదు. నా జుట్టును చూడండి. అది ఏ మాత్రం కదలడం లేదు. నేను చెబుతోంది వింటున్నారా? ఇది చాలా బ్యాడ్ ఐడియా. మీరు మాత్రం హెయిర్ స్ప్రే అయిపోతే ఎప్పుడూ గొరిల్లా గ్లూ స్ప్రేను మాత్రం జట్టుకు ఉపయోగించకండి. వాడితే నా జుట్టులాగే అయిపోతుంది.’ అంటూ టెస్సికా చెప్పుకొచ్చింది. టెస్సికా వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 19 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

టెస్సికా పరిస్థితిని చూసి చలించిపోయిన కొంత మంది నెటిజన్లు అయ్యో పాపం అంటుంటే.. మరికొంతమంది ‘జుట్టు ఇప్పుడు మామూలు స్థితికి వచ్చిందా’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెడుతున్నారు. అలాగే జుట్టును ఎలా పరిష్కరించుకోవాలో కూడా సూచించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన మార్పు రాకపోవడంతో సోమవారం ఆస్పత్రికి వెళ్లినట్లు టెస్సికా పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యురాలితో కలిసి ఓ ఫోటోను షేర్‌ చేశారు. అయితే గ్లూ జుట్లులోని లోపలి పొరల్లోకి వెళ్లడం వల్ల చిక్సి చేయడం కష్టతరమైన పని అని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందుకు బ్రౌన్‌ కోసం గోఫండ్‌మే అకౌంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఒక్క రోజులోనే 9 వేల డాలర్లను వసూలు చేసింది. దీనిపై స్పందించిన బ్రౌన్‌ తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే హెయిర్‌ నార్మల్‌ అయ్యే వరకు ప్రార్థించాలని కోరారు. ఇక టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన ఈ యువతి ప్రస్తుతం అన్ని సోషల్‌ మీడియా మాద్యమాలలో వైరల్‌ అవుతోంది.
చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి
 నుదుటిపై పింక్‌ డైమండ్‌‌.. విలువెంతో తెలుసా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement