Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక

నిప్పులగుండం మీద నడక తెలిసిందే. కానీ.. ఇది జారిపడితే బూడిద కూడా మిగలకుండా పోయే లావాపై నడక. ఊహించడానికే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! కానీ నడిచి చూపించారు బ్రెజిల్‌కు చెందిన రాఫేల్ బ్రీదీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ స్కుల్జ్. సాహసాలు చేయడంలో ఆరితేరిన ఈ ఇద్దరికీ తాడు మీద నడవడమంటే మంచినీళ్ల ప్రాయం.
అయితే సాధారణ తాడు మీద నడిస్తే... సాహసమేముందనుకున్నారేమో! టానా ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతంపై 137 అడుగుల ఎత్తులో తాడుపై నడిచారు. ఓ వైపు లావా ఎగసి పడుతుండగానే... ఆ తాడుపై 856 అడుగుల మేర నడిచి.. గిన్నిస్ రికార్డును సృష్టించారు.