ఉక్రెయిన్లు వెర్రివాళ్లు కారు.. యుద్దం ముగిసిపోలేదు: జెలెన్‌స్కీ

Zelenskyy said sought concrete results: రష్యా ఉక్రెయిన్‌పై నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అదీగాక ఇంతవరకు రష్యా శాంతి చర్చలు పాల్గొంటునే మరోవైపు నుంచి దాడులు కొనసాగిస్తూనే ఉంది. కానీ మంగళవారం టర్కీలో జరిగిన శాంతిచర్చల్లో కాస్త పురోగతి కనిపించింది. రష్యా కూడా కాస్త సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా కైవ్, చెర్నిహివ్ చుట్టూ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటానని వాగ్దానం చేసింది.
అయితే తాము వాటిని పూర్తిగా విశ్వసించలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఎందుకంటే గత 34 రోజులుగా సాగుతున్న ఈ యుధంలో తాము భయంకరమైన విధ్వంసాన్ని చవిచూశాం. డాన్‌బాస్‌లో గత ఎనిమిదేళ్లగా సాగుతున్న యుద్ధంలో తాము చాలా విషయాలు తెలుసుకున్నాం అని అన్నారు. అయినా ఉక్రెనియన్లు ఏమి అమాయకులు కారని ఇక్కడతో యుద్ధం ముగిసిపోయిందని తాము భావించట్లేదని చెప్పారు. అయితే ఈ ముఖామఖి చర్చలో సానూకూల సంకేతాలే వచ్చినట్లు తెలిపారు.
మరోవైపు యూఎస్ ఉక్రెయిన్‌ని తటస్థ వైఖరిని అవలంభిస్తాం అన్న ప్రతిపాదనతో ముప్పు ముగిసిపోయినట్లు కాదు అని హెచ్చరిస్తోంది. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై భారీ దాడి జరగకుండా చూడటానికి మనమందరం సిద్ధంగా ఉండాలి ఉక్రెయిన్ అధికారి జాన్ కిర్బీ పిలుపునిచ్చారు. రష్యా ఉక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాలైన డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల దిశగా తమ బలగాలను మళ్లీంచి దాడి చేసే అవకాశం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
(చదవండి: రష్యన్ బలగాలు వెనక్కి.. దానర్థం కాల్పుల విరమణ కాదు: రష్యా ట్విస్ట్)