వైరల్‌: పాపం ఈ భల్లూకం కష్టం చూడండి.. పిల్లల కోసం..

Viral: Mother Bear Struggles To Cross Busy Road With Her Cubs - Sakshi

ఓ భల్లూకం(ఎలుగు బంటి) తన పిల్లలను రోడ్డు దాటించడానికి కష్టపడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దిగా ఉండే ఆ రోడ్డు నుంచి తన పిల్లలను జాగ్రత్తగా తీసుకుళ్లేందుకు ఆ ఎలుగు పడుతున్న పాట్లు చూసి పలువురు నెటిజన్లు చలిస్తున్నారు. యుకే జరిగిన ఈ సంఘటన అక్కడి పోలీసులు పోలీసులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు. 

నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో.. ఎలుగు బంటి తన పిల్ల భల్లూకాన్ని నోట కరుచుకుని రోడ్డు దాటే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో రోడ్డుపై కొన్ని వాహనాలు నిలిచి ఉన్నాయి. వాటిని చూసి కంగారు పడ్డ ఆ ఎలుగు  వెంటనే వెనక్కి తిరిగి తన మిగతా పిల్లల దగ్గరికి వెళ్లింది. వాటిని కూడా తనతోపాటు రమ్మని సైగ చేస్తూ మరోసారి ఒక పిల్ల ఎలుగును నోట కరుచుకుంది. అలా రోడ్డు దాటుతూ మళ్లీ వెనక్కి తిరిగింది.

అలా ఆ తల్లి ఎలుగు తన పిల్లల రక్షణపై ఆందోళన చెందుతూ తడబడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘అందరి తల్లుల కష్టాలు ఇలాగే ఉంటాయి, పాపం తల్లి ఎలుగు’, ‘ఇదే తల్లి ప్రేమ అంటే తన పిల్లల రక్షణ కోసం ఈ ఎలుగు ఎంత అందోళన చెందుతుందో చూడండి’ అంటూ కొందరూ స్పందిస్తుండగా.. మరికొందరూ అంతసేపు ఓపికగా రోడ్డుపై ఎదురు చూస్తున్న వాహనాదారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాక పోలీసులు సైతం ఎలుగు సంరక్షణ గురించి ఆలోచించి అంతసేపు ఓపిగ్గా వాహనాలు నిలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top