వీడియో: వహ్‌.. ఏం టైమింగ్‌! ముంచుకొచ్చిన మృత్యువు నుంచి తప్పించుకుంది

Viral: Lion Great Escape Hippo Carcass Saves Itself From Crocodiles - Sakshi

వైరల్‌: ఆయుష్షు గట్టిదైతే.. ఎంతటి ప్రమాదం నుంచి అయినా బయటపడొచ్చు. అయితే దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. మృత్యువు వెంటాడినా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి మృత్యువు ముఖం నుంచి తప్పించుకుంది ఓ సింహం ఇక్కడ. 

కెన్యా మసాయ్‌ మరా నేషనల్‌ రిజర్వ్‌ పార్క్‌లో మే 23వ తేదీన ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే దాని మీద ఓ సింహం కూడా కనిపించింది. దీంతో పెసీ తన కెమెరాతో షూట్‌ చేయడం ప్రారంభించాడు.

సుమారు నలభైకి పైగా మొసళ్లు.. హిప్పో మృతదేహం చుట్టూ చేరాయి. కాస్త ఉంటే.. పైన ఉన్న సింహం కూడా వాటికి బలి అవుతుందేమో అనుకున్నాడు పెసీ. అయితే ప్రాణ భయంతో హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అదను చూసి నీళ్లలోకి ఒడ్డుకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top