క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తాం! | US warns Indian, foreign students: Miss classes, risk losing visa | Sakshi
Sakshi News home page

క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తాం.. విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ వార్నింగ్‌!

May 27 2025 3:15 PM | Updated on May 27 2025 5:01 PM

US warns Indian, foreign students: Miss classes, risk losing visa

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ విదేశీ విద్యార్థులకు వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు తప్పని సరిగా వారు చదువుతున్న కాలేజీలు,యూనివర్సిటీ క్లాసులకు హాజరవ్వాలని,లేదంటే వీసా రద్దు చేస్తామని హెచ్చరించారు.

అంతేకాదు, క్లాసులు హాజరు కాకపోతే ప్రస్తుతం వినియోగంలో ఉన్న వీసాలను రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా అర్హతను కోల్పోతారని స్పష్టం చేశారు. 

ట్రంప్‌ సర్కార్‌ విదేశీ విద్యార్ధులపై తీసుకున్న తాజా నిర్ణయానికి అనుగుణంగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy in India) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డ్రాపౌట్‌ అయినా, క్లాస్‌లకు గైర్హాజరైనా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్‌ నుంచి వెళ్లిపోయినా.. మీ విద్యార్థి వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి’ అని యూఎస్‌ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.

విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు
అమెరికాలో చదువుతున్న విద్యార్థి విద్యార్ధులపై ట్రంప్‌ సర్కార్‌ కఠిన ఆంక్షలు విధిస్తోంది. పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన విద్యార్థులకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే వారి వీసాల్ని రద్దు చేస్తోంది.

ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు గుడ్‌బై
అమెరికాలో యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థుల సమాచారాన్ని ట్రాక్ చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిర్వహించే వెబ్ ఆధారిత ప్లాట్‌ఫామ్ ఎస్‌ఈవీఐఎస్‌ (స్టూడెంట్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) నుండి విద్యార్థుల రికార్డ్‌లను తొలగిస్తుంది.  దీంతో పాటు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పనిచేసే విద్యార్థులకు కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ను తొలగించాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓపీటీ కార్యక్రమానికి ముగింపు పలికేందుకు అమెరికా చట్టసభ సభ్యులు ఇప్పటికే ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ ఆఫ్ 2025 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చీఫ్‌గా డైరెక్ట‌ర్‌గా ఉన్న జోసెఫ్ ఎడ్లో ఇటీవ‌ల ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విదేశీ విద్యార్థులు వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లు ముగిసిన తర్వాత అందుబాటులో ఉన్న ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ప్రోగ్రామ్‌లను రద్దు చేస్తామన్నారు.

ఇలా వ‌రుస నిర్ణ‌యాల‌తో అగ్ర‌రాజ్యం అమెరికా తీసుకుంటున్న వ‌రుస నిర్ణ‌యాల‌తో విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న మ‌తిలేని చ‌ర్య‌ల‌కు తామెప్పుడు బ‌ల‌వుతామోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement