లక్షన్నరలో ఒక పుట్టుక.. అరుదైన ఘట్టం | Sakshi
Sakshi News home page

వైరల్‌: లక్షన్నరలో ఒక పుట్టుక.. అరుదైన ఘట్టం

Published Sat, Dec 24 2022 9:15 PM

US Newborn Shares Birthday With Both Parents - Sakshi

బిడ్డ పుట్టడం..  ఏ తల్లిదండ్రులకైనా జీవితాతంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. కానీ, ఇక్కడ ఓ పేరెంట్స్‌కు మాత్రం అదెంతో ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే.. లక్షన్నరలో ఒక్కరు మాత్రమే అలా పుట్టే అవకాశం ఉంది కాబట్టి. 

అలబామా హంట్స్‌విల్లెకు చెందిన క్యాసిడీ, డైలన్‌ స్కాట్‌లు డిసెంబర్‌ 18వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ తేదీ ఆ భార్యాభర్తలిద్దరికీ ఎంతో ప్రత్యేకం. కారణం.. అదే రోజు వాళ్లిద్దరి పుట్టినరోజు కాబట్టి. పైగా నార్మల్‌ డెలివరీ ద్వారా ఆ బిడ్డ పుట్టింది.

ఈ భూమ్మీద దాదాపు లక్షన్నర మందిలో.. ఇలాంటి ఒక పుట్టుక ఉంటుందనే అంచనా ఉంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకుంది ఆ బిడ్డ పుట్టిన హంట్స్‌విల్లే హాస్పిటల్‌. ఇలాంటి తేదీల్లోనే జన్మనిచ్చిన మరికొందరు తల్లిదండ్రులు.. కింద కామెంట్‌ సెక్షన్‌లో తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement