Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం

University Building Exploded In Gaza Us Seeks Clarification - Sakshi

గాజా: నాలుగు నెలలుగా ఇజ్రాయెల్‌ హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 7న తమపై హమాస్‌ చేసిన మెరుపు దాడి తర్వాత ఇజ్రాయెల్‌ గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గాజాలోని అల్‌ ఇసారా యూనివర్సిటీ భవనాన్ని ఇజ్రాయెల్‌ ఆర్మీ పేల్చివేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అల్‌ ఇసారా యూనివర్సిటీ ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆధీనంలోనే ఉంది.

అయితే బయటి నుంచి వేసిన బాంబుల వల్ల కాకుండా ఆ భవనంలో దాచి ఉంచిన పేలుడు పదార్థాల వల్లే పేలుడు జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది.  దీంతో ఈ విషయమై ఇజ్రాయెల్‌ను అమెరికా వివరణ కోరింది. యూనివర్సిటీ భవనం పేలుడుకు సంబంధించి అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు.

తమకు ఈ పేలుడుపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేనందున కామెంట్‌ చేయలేమని అమెరికా తెలిపింది. తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపింది. ఈ ప్రాంతంలో హమాస్‌ లీడర్లున్నారనే సమాచారంతోనే ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

  ఇదీచదవండి.. హౌతీలపై భూతల దాడులకు యెమెన్‌ పిలుపు 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top