హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు | Yemen Official Calls Ground Action Against Houthis | Sakshi
Sakshi News home page

హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు

Jan 19 2024 10:15 AM | Updated on Jan 19 2024 10:28 AM

Yemen Official Calls Ground Action Against Houthis  - Sakshi

యెమెన్, సనా: ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలపై తిరుగుబాటుకు యెమెన్ పిలుపునిస్తోంది. అయితే.. హౌతీలపై భూతల దాడులు చేయడానికి తమ సైన్యానికి తోడుగా ఇతర దేశాల సైన్యం సహకారం అవసరమని యెమెన్ అధ్యక్ష మండలి  డిప్యూటీ నాయకుడు అన్నారు. ఎడెన్ పోర్టు సమీపంలో అమెరికా నౌకపై హౌతీలు దాడి జరిపిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. 

ఎడెన్ పోర్టు ప్రాంతంలో అమెరికా నౌకపై క్షిపణులతో దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అయితే.. ఈ దాడిలో తమ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదని అమెరికా స్పష్టం చేసింది. హౌతీల యాంటీ షిప్ క్షిపణిపై అమెరికా దాడులు జరిపిన మరుసటి రోజే ఎడెన్ పోర్టు ప్రాంతంలో హౌతీలు రెచ్చిపోయారు. 

'హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, యూకే వైమానిక దాడులతో పాటు భూతల యుద్ధానికి మాకు విదేశీ సహాయం అవసరం. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నావిగేషన్‌ను సురక్షితంగా ఉంచడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమి అవసరం" అని  యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. 

గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ప్రారంభించారు. ఇజ్రాయెల్‌కు వెళ్లే నౌలపైనే కాకుండా ఇతర దేశాల నౌకలపై కూడా హౌతీల దాడులు విస్తరించాయి. దీంతో అమెరికా సహా మిత్రపక్షాలు ఏకమై ఎర్రసముద్రంలో హౌతీల దాడుల నుంచి నౌకలను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి.  

ఇదీ చదవండి: Pakistan Strikes On Iran: ఇరాన్‌పై పాక్‌ ప్రతీకార దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement