అసిమ్‌ మునీర్.. యూఎస్‌ పర్యటనకు వస్తావా?, నీకు సిగ్గుందా? | Pak Army Chief Asim Munir Faces Protests In America | Sakshi
Sakshi News home page

అసిమ్‌ మునీర్.. యూఎస్‌ పర్యటనకు వస్తావా?, నీకు సిగ్గుందా?

Jun 17 2025 8:16 PM | Updated on Jun 17 2025 9:01 PM

Pak Army Chief Asim Munir Faces Protests In America

వాషింగ్టన్‌ డీసీ: పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌.. జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌. నియంతగా, అత్యంత కఠినాత్ముడిగా పేరుంది. పాకిస్తాన్‌లో ప్రధాని పేరు కంటే కూడా అసిమ్‌ మునీర్‌ పేరే ఎక్కువగా వినిపిస్తుందనేది కాదనలేని సత్యం. ఇదంతా ఒకటైతే, ఇప్పుడు మునిర్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. అధికారిక అమెరికా పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు మునీర్‌. 

అయితే మునీర్‌కు అమెరికాలో నిరసన సెగ మామూలుగా లేదు. పెద్ద ఎత్తును మునీర్‌ అమెరికా పర్యటనపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. భారీగా హోర్డింగ్‌లు వెలవడంతో పాటు నిరసనకారులు కూడా రోడ్లపైకి  వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.  అసలు అమెరికా పర్యటనకు రావడానికి నీకు సిగ్గుందా..? అని మనీర్‌ బస చేస్తున్న చోట నిరసనకారులు ఆందోళన చేపట్టారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘పాకిస్తాన్‌ ప్రజలు ప్రాణాలు తీసే నీవు ఇక్కడ ఏం మాట్లాడాతావ్‌, ఇక తుపాకీలు మాట్లాడితే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్లే’  అని వెలసిన హోర్డింగ్‌లు మునీర్‌పై తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. 

 

 

ఐదు రోజుల అమెరికా పర్యటన

పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చారు.  ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక,  వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్  వాషింగ్టన్ చేరుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement