ఉక్రెయిన్‌ తల్లుల ఆవేదన.. ఒక్కసారి చూడనివ్వండి!

Ukraine Woman Weeps Once Her Son Was Laid Out  - Sakshi

Ukrainian mother fell to her knees: ఉక్రెయిన్‌పై గత నెలరోజులకు పైగా రష్యా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా బలగాలు ఉపసంహరణ దిశగా వెళ్లినట్లే వెళ్లి.. మళ్లీ ఉక్రెయిన్‌కి ఉత్తరం వైపు నుంచి దాడులు జరిపాయి. దీంతో బుచా వంటి నగరాలు శవాల దిబ్బగా మారిపోయాయి. ప్రస్తుతం రష్యా బలగాలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ని స్వాధీనం చేసుకునేందుకు దాడులను విరమించుకుంది. దీంతో అధికారులు ఉత్తరాదిన ఉన్న బుచా వంటి నగరాల్లో జరిగిన నష్టాన్ని అంచన వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన విధ్వంసంలో మృతి చెందిన వారిని వెలికితీసి, గుర్తించే పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఒక తల్లి తన కొడుకు శవాన్ని గుర్తుపట్టింది. ఆమె కొడుకు మృతదేహం ఒక మ్యాన్‌హోల్‌లోని నీటిలో ‍కనిపించింది. తన కొడుకు ధరించిన చెప్పుల ఆధారంగా గుర్తుపట్టగలిగింది. అంతేకాదు అక్కడ యుద్ధ ట్యాంకుల సమీపంలో  ఉక్రెయిన్‌ సైనిక దుస్తులతో మరో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. వారు ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్‌కి చెందిన సభ్యులని అధికారులు తెలిపారు.

అంతేకాదు అక్కడ పరిసర ప్రాంతాలను ఎటు నుంచి చూసిన విషాదంగానే కనిపిస్తున్నాయి. కుమారులను కోల్పోయిన తల్లులు బాధ వర్ణనాతీతం. ఒక్కసారి తమ కుమారులను చూడనివ్వండంటూ మృతదేహాలను తరలిస్తున్న అధికారులను అడుగుతున్న తీరు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. జెనీవా ఒప్పందాల ప్రకారం యుద్ధ ఖైదీలను ఉరితీయడం నిషేధించారు. మరీ రష్యా బలగాలు ఇలా ఏ విధంగా చేయగలిగారంటూ.. ఆక్రోశంతో ప్రశ్నిస్తున్నారు ఉక్రెయిన్‌ వాసులు. కానీ మాస్కో మాత్రం ఆ దాడులన్నింటినీ ఖండించడమే కాకుండా సమర్థించుకునేందకు యత్నిస్తోంది.

(చదవండి: తగ్గేదేలే.. పుతిన్‌ సంచలన నిర్ణయం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top