UK Woman Finds Full Chicken Head In KFC Box, See Company Reaction - Sakshi
Sakshi News home page

Chicken Head In KFC Box: కేఎఫ్‌సీ చికెన్‌లో కోడి తల.. కస్టమర్‌కు చేదు అనుభవం!

Dec 23 2021 6:03 PM | Updated on Dec 23 2021 7:38 PM

UK Customer Finds Partially Fried Chicken Head Inside Of KFC Box Know Company Reaction - Sakshi

కేఎఫ్‌సీ చికెన్‌కు ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజీ ఉందనడంతో అతిశయోక్తి లేదు! భోజన ప్రియులు ఈ ఫ్రైడ్‌ చికెన్‌ను లొట్టలేసుకులాగించేస్తారు. ఐతే ఓ మహిళ ముచ్చటపడి తన కిష్టమైన కేఎఫ్‌సీ చికెన్‌ బాక్స్‌ను ఆర్డరిచ్చిమరీ ఇంటికి తెచ్చుకుంది. తిందామని తెరిచిచూస్తే షాక్‌ కొట్టినంతపనైంది.

ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గాబ్రియేల్‌ అనే మహిళ కేఎఫ్‌సీ టేక్‌అవే బాక్స్‌ను ఆర్డరిచ్చి తెప్పించుకుంది. ఐతే చికెన్‌ బాక్స్‌లో పిండి పూసిన కోడి తల కాయ వచ్చింది. పాక్షికంగా ఉడికిన తల, కళ్ళు, ముక్కుతో ఉన్న కోడి తలకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను ఎదుర్కొన్న చేదుఅనుభవాన్ని పంచుకుంది. దీనిపై స్పందించిన కేఎఫ్‌సీ కంపెనీ ఈ ఫొటోను చూసి మేము ఆశ్చర్యపోతున్నాము. మొత్తం తల ఎలా వచ్చిందో, ఎలా జరిగిందో పరిశీలిస్తామని, ఈ తప్పు మళ్లీ జరగకుండా నివారిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఆమెను కేఎఫ్‌సీ అధికారులు ఆమెను సంప్రదించి ఉచితంగా మరొక చికెన్‌ బాక్స్‌ అందించడమేకాకుండా ఆమెను, ఆమె కుటుంబం మొత్తాన్ని సదరు సెంటర్‌కు ఆహ్వానించింది. తాము ఏవిధంగా కిచెన్‌లో చికెన్‌ ప్రిపేర్‌ చేస్తామో తనిఖీ చేయమని అదే టేక్‌అవే కేఎఫ్‌సీ ప్లేస్‌కు రావల్సిందిగా కోరింది. కాగా గతంలో ఓ వ్యక్తికి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌లో సరిగ్గా ఉడకని చికెన్‌ సర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే!

చదవండి: Good News! ఇక డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు లేకుండానే ఆన్‌లైన్‌ షాపింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement